శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (17:28 IST)

శబరిమల తీర్పు.. జస్టిస్ ఇందు మల్హోత్రా.. ఏకీభవించలేదట..

కేరళలోని సుప్రసిద్ధ శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చునని సుప్రీం కోర్టు శుక్రవారం సంచలన తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును 4-1 మెజార్టీతో వెలువరించింది. నలుగురు న్యా

కేరళలోని సుప్రసిద్ధ శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చునని సుప్రీం కోర్టు శుక్రవారం సంచలన తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును 4-1 మెజార్టీతో వెలువరించింది. నలుగురు న్యాయమూర్తులు ఈ తీర్పుకు సానుకూలంగా ఓటేసినా.. ఏకైక మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా మాత్రం ఈ తీర్పురై ఏకీభవించలేదు. 
 
మతపరమైన మనోభావాలను అడ్డుకోకూడదని తీర్పు అడ్డు తగిలారు. భారతదేశంలో వేర్వేరు మతాచారాలు ఉన్నాయని, ఎవరైనా ఏదైనా మతాన్ని గౌరవిస్తే.. అందుకు రాజ్యాంగం అనుమతిస్తుందన్నారు. మతపరమైన ఆచారాలలో జోక్యం చేసుకోవడాన్ని రాజ్యాంగం అనుమతించదని పేర్కొన్నారు. 
 
అక్షరాస్యత కారణంగా కేరళ మహిళలు సామాజికంగా పురోభివృద్ధిని సాధించారని... వీరిలో ఎక్కువ మంది శబరిమల ఆచరించే ఆచారాల పట్ల వ్యతిరేకతతో లేరని చెప్పారు. ట్రిపుల్ తలాక్, సెక్షన్ 377 కేసుల్లో నిజమైన బాధితులు కోర్టులను ఆశ్రయించారని... అందుకే ఆ కేసులు ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని తెలిపారు. ఇకపోతే.. ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. 
 
కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళలను ప్రవేశానికి అనుమతి ఇస్తూ.. సుప్రీం కోర్టు ఈ రోజు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలసిందే. కాగా... సుప్రీం ఇచ్చిన తీర్పును కర్ణాటక మహిళా మంత్రి జయమాల స్వాగతించారు.