హనుమాన్ చాలీసా జపిస్తే... సకల సౌభాగ్యాలు..?
ఎవరి ఇంటికైన వెళితే లోపలికి వెళ్ళగానే ముందుగా హనుమ చిత్రపటమే కనిపిస్తుంది. అలానే ఆ ఇంట్లో చిన్నారుల మెడలో హనుమ రూపు తాడు కనిపిస్తుంది. ఇక ఆడపిల్లలు సిందూరం ధరించుంటారు. ప్రతి ఇంట్లో ఇలా ఉండడం వలన దుష్
ఎవరి ఇంటికైన వెళితే లోపలికి వెళ్ళగానే ముందుగా హనుమ చిత్రపటమే కనిపిస్తుంది. అలానే ఆ ఇంట్లో చిన్నారుల మెడలో హనుమ రూపు తాడు కనిపిస్తుంది. ఇక ఆడపిల్లలు సిందూరం ధరించుంటారు. ప్రతి ఇంట్లో ఇలా ఉండడం వలన దుష్టశక్తుల బారిన పడకుండా ఉంటారు. హనుమకు ప్రదక్షణలు చేసి హనుమాన్ చాలీసాను స్మరించడం వలన గ్రహ సంబంధిత దోషాలు తొలగిపోతాయి.
ఉత్తరాది ప్రాంతానికి చెందిన వారు చైత్ర పౌర్ణమి రోజున హనమకు పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. స్వామివారికి ఇష్టమైన పిండి పదార్థాలను నైవేద్యంగా సమర్పించి ప్రీతికరమైన పండ్లను ఆలయానికి తీసుకువెళుతుంటారు. ఈ రోజున ఉపవాస దీక్షతో సుందరకాండ పారాయణ చేయవలసి ఉంటుంది. ఇలా ఈ రోజున హనుమను ఆరాధించడం వలన సకల సౌభాగ్యాలు చేకూరుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.