బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 4 మే 2017 (10:42 IST)

అపుడు రద్దు చేశారు.. ఇపుడు మాకెందురు శిక్ష వేశారు.. సుప్రీంలో శశికళ సమీక్ష పిటిషన్‌

ఒక అవినీతి కేసులో ప్రధాన నిందితుడు లేదా నిందితురాలు మరణించిన తర్వాత సహ నిందితులుగా ఉన్న తమకు ఎలా శిక్షలు విధిస్తారంటూ జయలలిత అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష పడిన శశికళతో పాటు మిగిలిన ముగ్గురు సుప్రీంకోర్

ఒక అవినీతి కేసులో ప్రధాన నిందితుడు లేదా నిందితురాలు మరణించిన తర్వాత సహ నిందితులుగా ఉన్న తమకు ఎలా శిక్షలు విధిస్తారంటూ జయలలిత అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష పడిన శశికళతో పాటు మిగిలిన ముగ్గురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు శశికళ, ఇళవరసి, వీఎన్ సుధాకరన్‌లు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. 
 
జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా నిర్ధరిస్తూ, తనకు నాలుగేళ్ల శిక్ష విధించటానికి సంబంధించిన తీర్పును పునఃపరిశీలించాలని వారంతా తమ పిటీషన్లలో కోరారు. ముఖ్యంగా.. ఈ కేసులో తమను విడిచిపెడుతూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టటాన్ని సవాల్‌ చేశారు. 
 
అక్రమాస్తుల కేసులో జయలలితతో పాటు శశికళ, సుధాకరన్‌, ఇళవరసిలను బెంగుళూరులోని ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఆ తర్వాత కర్నాటక హైకోర్టు ఈ తీర్పును పూర్తిగా కొట్టివేసి నిర్దోషులుగా విడుదల చేసింది. 
 
కానీ, సుప్రీంకోర్టులో కర్నాటక సర్కారు సవాల్ చేయగా, అక్కడు చుక్కెదురైంది. అయితే, ఒక అవినీతి కేసులో ప్రధాన నిందితుడు మరణించిన తర్వాత సహ నిందితుడిపై విచారణను రద్దుచేస్తూ సుప్రీంకోర్టు 1991లో ఇచ్చిన తీర్పు ఆధారంగా శశికళ ఈ సమీక్ష పిటిషన్‌ వేసినట్టు దీని గురించి తెలిసిన న్యాయవాది ఒకరు తెలిపారు.