శనివారం, 2 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 10 నవంబరు 2022 (17:38 IST)

చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లిన రోగిని చితకబాదిన వైద్యుడు

doctor trash
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కోర్బా జిల్లాలో ఉన్న వైద్య కాలేజీలో మద్యం మత్తులో ఉన్న ఓ వైద్యుడు చికిత్స చేయించుకునేందుకు ఆస్పత్రికి వెళ్ళిని రోగిని చితకబాదాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆస్పత్రి యాజమాన్యం వైద్యుడికి షోకాజ్ నోటీసు జారీచేసింది. 
 
రోగి కుమారుడు శ్యామ్ కుమార్ తన తల్లి సుఖమతి ఆరోగ్యం ఉన్నట్టు అర్థరాత్రిపూట క్షీణించింది. దీంతో వైద్య కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడి ఆమెకు చికిత్స చేయాల్సిన వైద్యుడు.. రోగిని చితకబాదాడు. రోగిని వైద్యుడు చితకబాదుతుంగా వీడియో తీసిన శ్యామ్ కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. 
 
దీన్ని చూసిన ఉన్నతాధికారులు వైద్యుడికి షోకాజ్ నోటీసు జారీచేసింది. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని వైద్యుడికి షోకాజ్ నోటీసు జారీ చేశామని మెడికల్ కాలేజీ ఆస్పత్రి డీన్ డాక్టర్ అవినాష్ మెష్రామ్ తెలిపారు. అలాగే, ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. అదేసమయంలో రోగిపై దాడి చేసిన వైద్యుడిని రోగి బంధువులు కర్రలతో చితకకొట్టారు.