బుధవారం, 11 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 ఆగస్టు 2024 (07:25 IST)

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతినుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

Droupadi Murmu
Droupadi Murmu
భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఎందరో పోరాటాలు చేసిన ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. ఆగస్ట్ 14వ తేదీ దేశవిభజన నాటి పీడకలను స్మరించుకునే రోజు అన్నారు. 
 
దేశ స్వాతంత్ర్యం కోసం గిరిజనులు చేసిన పోరాటాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. భగవాన్ బిర్సా ముండా జయంతిని జన్‌జాతీయ గౌరవ్ దివస్‌గా జరుపుకొంటున్నామని, వచ్చే ఏడాది ఆయన 150వ జయంత్యుత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. 
 
స్వాతంత్ర్య సమరయోధులకు నివాళిగా కొత్త క్రిమినల్ చట్టాలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వం సాధించిన విజయాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. 
 
ఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాల సంక్షేమం కోసం నరేంద్రమోదీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవడం గర్వకారణమని పేర్కొన్నారు.