శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్

కలెక్టర్‌పై నోరు జారిన భారాస ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ... కొత్త నేరాల చట్టం కింద కేసు!! (Video)

koushik reddy
తెలంగాణ రాష్ట్రంలో విపక్ష భారత రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కొత్త క్రిమినల్ చట్టం కింద కేసు నమోదైంది. ఆయన జిల్లా కలెక్టర్‌తో పాటు తెలంగాణ మంత్రులపై నోరు పారేసుకున్నారు. ముఖ్యంగా, కలెక్టర్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నువ్వెంత.. నీ కథ ఎంత... ఎక్కువ రోజులు ఉండవ్.. పోరా బై పో' అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసభ్య పదజాలంతో దూషించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మంత్రి పొన్నం ప్రభాకర్‌పై కూడా బూతులు తిట్టారు దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
దీంతో పలువురు కాంగ్రెస్ నేతలు, అధికారులు ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డిపై కొత్త నేరాల చట్టం కింద కేసు నమోదు చేశారు. దేశంలో కొత్త నేర చట్టాల కింద ఎమ్మెల్యేపై కేసు నమోదు కావడం ఇదే కావడం గమనార్హం. కాగా, జిల్లా పరిషత్ మీటింగ్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికారులపై రెచ్చిపోయారు. అధికారులు, తోటి ప్రజాప్రతినిధులను అసభ్య పదజాలంతో దూషించారు. పార్టీ మారిన ప్రజా ప్రతినిధులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.