శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 2 జులై 2024 (08:56 IST)

24 యేళ్ల నాటి కేసులో మేధా పాట్కర్‌కు జైలు శిక్ష : ఢిల్లీ కోర్టు తీర్పు

medha patkar
ప్రముఖ సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌కు ఢిల్లీ హైకోర్టు జైలుశిక్ష విధించింది. 24 యేళ్ళ నాటి పరువు నష్టం దావా కేసులో సోమవారం ఈ శిక్షను ఖరారు చేసింది. ఐదు నెలలో జైలుశిక్షతో పాటు 10 లక్షల రూపాయల అపరాధాన్ని కూడా విధించింది. అయితే, ఈ ఆదేశాలపై ఆమె అప్పీలుకు వెళ్లేందుకు శిక్షను నెల పాటు వాయిదా వేసింది. పాట్కర్‌ ఓ టీవీ చానల్‌లో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ 2001లో ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సక్సేనా ఆమెపై పరువునష్టం కేసు వేశారు. తాజాగా ఈ కేసులో మేజిస్ట్రేట్‌ రాఘవ్‌ శర్మ తీర్పు వెలువరించారు. అంతకుముందు 2000వ సంవత్సరంలో సక్సేనాపై పాట్కర్‌ దావా వేశారు. అప్పటి నుంచి వీరిమధ్య వివాదం కొనసాగుతున్నది. పరిశీలన షరతులపై తనను విడుదల చేయాలన్న పాట్కర్‌ విజ్ఞప్తిని న్యాయమూర్తి తిరస్కరించారు. 
 
పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చెయ్యడమంటే కొరివితొ తల గొక్కోవటమే : వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి 
 
ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైకాపా చిత్తు చిత్తుగా ఓడిపోయింది. 2019 జరిగిన ఎన్నికల్లో 151 సీట్లను గెలుచుకున్న వైకాపా.. తాజాగా జరిగిన ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైంది. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఓడిపోడానికి కారణం ప్రతి ఒక్క వర్గాన్ని కెలకడం, ప్రతి పుట్టులో వేలుపెట్టడం. చిత్తుగా ఓడిన తర్వాత ఈవీఎంలు వల్ల ఓడిపోయాం అనే ఓ కుంటి సాకు చెబుతున్నారు. బొక్కలన్నీ జేబులో పెట్టుకొని ఈవీఎంలపై నెపం నెడితే ఉపయోగం లేదంటూ వైకాపా నేతలు కామెంట్స్ చేస్తున్నారు. 
 
ముఖ్యంగా, గత ఎన్నికల్లో తాము చిత్తు చిత్తుగా ఓడిపోవడానికి ప్రధాన కారణాలను వైకాపా నేతలు ఇపుడిపుడే గ్రహిస్తున్నారు. ఇలాంటి వారిలో ధర్మవరం వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయడమే తమ కొంప ముంచిందన్నారు. పవన్‌ను లక్ష్యంగా చేసుకోవడమంటే కొరివితో తల గోక్కోవడమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తమ పార్టీ నేతలు ఇప్పటికైనా గ్రహించాలని ఆయన హితవు పలికారు.