ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 మార్చి 2023 (14:32 IST)

రైల్లో అర్థరాత్రి మహిళా ప్రయాణికురాలి తలపై మూత్ర విసర్జన చేసిన టీసీ!

train
అమృతసర్ నుంచి కోల్‌కతా వెళుతున్న అకాల్ తఖ్తత్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఈ రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలి తలపై టీసీ ఒకరు మూత్ర విసర్జన చేశాడు. బాధితురాలు తన భర్త రాజేశ్ కుమార్‌తో కలిసి కోల్‌కతా వెళుతుండగా ఈ ఘటన జరిగింది. నిందితుడిని మున్నా కుమార్‌గా గుర్తించారు. పీకల వరకు మద్యం సేవించిన టీసీ మున్నాకుమార్... ఈ పాడుపనికి పాల్పడ్డాడు. బాధితారులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
టీసీ చేసిన పాడుపనికి ఆ మహిళా ప్రయాణికురాలు బిగ్గరగా కేకలు వేయడంతో ఇతర ప్రయాణికులు నిద్రలేచి, పారిపోతున్న టీసీని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడు బిహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కాగా, ఇటీవలి కాలంలో విమానంలో పలువురు ప్రయాణికులపై మూత్ర విసర్జన చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. వీటిని మరచిపోకముందే రైలులో ఇలాంటి ఘటనే చోటుచేసుకోవడం గమనార్హం.