సోమవారం, 2 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 మార్చి 2023 (14:44 IST)

మద్యం మత్తులో కానిస్టేబుల్ వీరంగం.. దంపతుల కారును ఆపి..?

telangana police
మద్యం మత్తులో ఓ కానిస్టేబుల్ నడిరోడ్డుపైనే వీరంగం సృష్టించాడు. దంపతుల కారును ఆపి నానా హంగామా సృష్టించాడు.
 
కారులో వస్తున్న దంపతులను ఆపి అసభ్యకరమైన పదజాలాలతో దూషిస్తూ.. మహిళ అని చూడకుండా ఆమెపై చిందులు వేశాడు. 
 
ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీస్టేషన్ పరిధిలోని కొత్వాల్ గుడా ఔటర్ రింగ్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది.
 
కానిస్టేబుల్ తీరుతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చిర్రెత్తుకొచ్చిన దంపతులు వెంటనే డయల్ 100కి ఫోన్ చేశారు. 
 
దీంతో వారిపై చిందులు తొక్కిన కానిస్టేబుల్ మద్యం మత్తులోనే తన కారును నడుపుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.