బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 ఫిబ్రవరి 2023 (15:46 IST)

కానిస్టేబుల్ రాజశేఖర్‌కు మెగాస్టార్ సెల్యూట్

chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్‌కు సెల్యూట్ చెప్పారు. రోడ్డుపై కుప్పకూలి పడిపోయిన ఒక యువకుడి ప్రాణాలను కాపాడిన రాజశేఖర్‌కు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. యువకుడికి సీపీఆర్ అందించిన తీరుపై ప్రశంసించారు. 
 
వివరాల్లోకి వెళితే.. సైబరాబాద్ పరిధికి చెందిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ రాజశేఖర్ అనే యువకుడికి గుండెపోటు రావడంతో కార్డియాక్ అరెస్ట్ నుంచి కాపాడారు. సిపిఆర్ చేసి అతని ప్రాణాలు కాపాడి ఆసుపత్రికి తరలించారు. 
 
ఎల్బీనగర్ నుండి ఆరంఘర్ వద్దకు వచ్చిన బస్సు నుంచి దిగిన బాలాజీ అనే యువకుడికి గుండెపోటు వచ్చింది.  అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ వెంటనే అతని వద్దకు వెళ్లి, అతని పరిస్థితి గమనించి ఛాతీపై బలంగా ప్రెస్ చేసి సిపిఆర్ చేసి అతడిని కాపాడారు. 
 
ఈ క్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన ప్రముఖులంతా రాజశేఖర్‌ను కొనియాడారు. ఈ క్రమంలో మెగాస్టార్ కూడా కానిస్టేబుల్‌కు కితాబిచ్చారు.