శుక్రవారం, 22 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 మార్చి 2023 (15:02 IST)

ఫుల్లుగా మద్యం సేవించి గుర్రపెట్టి నిద్రపోయిన వరుడు..

groom sleep
సాధారణంగా పెళ్ళికి వచ్చిన వరుడు స్నేహితులు పీకలవరకు మద్యం సేవించి చిందురు వేస్తూ సందడి చేస్తారు. చివరకు అలసిపోయి గాఢనిద్రలోకి జారుకుంటారు. అయితే, ఇక్కడ ఏకంగా తాళి కట్టాల్సిన వరుడే ముందు కొట్టి పెళ్లి పీటలపై కూర్చొన్నాడు. మద్యం డోస్ ఎక్కువైందేమేగానీ ఏకంగా మరో స్నేహితుడి ఒడిలో తన తల పెట్టుకుని హాయిగా నిద్రపోయాడు. ఈ పెళ్లికి వచ్చిన వరుడే కాదు.. ఏకంగా 95 శాతం మంది ఇదే విధంగా ప్రవర్తించారు. దీంతో వధువుకు చిర్రెత్తుకొచ్చి ఇలాంటి తాగుబోతు వెధవను తాను పెళ్లి చేసుకోబోనని తెగేసి చెప్పింది. ఫలితంగా ఆ పెళ్లి కాస్త పెటాకులైంది.
 
అస్సాం రాష్ట్రంలోని నల్బరీ పట్టణానికి చెందిన ప్రసేన్ జిత్ హలోయి అనే యువకుడి ఓ యువతితో పెళ్లి నిశ్చయించారు. దీంతో ఈ పెళ్లిని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇరు కుటుంబాల పెద్దలు భారీగా ఏర్పాట్లు చేశారు. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయింది. పెళ్లి కుమారుడే ఏకంగా పీకలవరకు మద్యం సేవించి పెళ్లిపీటలపైనే గుర్రుపెట్టి నిద్రపోయాడు. 
 
పెళ్లి కుమారుడుతో పాటు వరుడు కుటుంబ సభ్యులు చేసిన పనికి వధువు బంధువులు పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని వారు ప్రాధేయపడ్డారు. పెళ్లికి ఖర్చు చేసిన డబ్బులను తిరిగి ఇప్పించాలని వారు కోరారు. అదేసమయంలో ఆ తాగుబోతును పెళ్లి చేసుకునేందుకు వధువు మొండికేసింది.