ఆ గ్రామాన్ని తాకని కరోనా వైరస్.. గిరిజనులకు భయపడి..?
కరోనా వైరస్ విజృంభిస్తోంది. కోవిడ్ సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. కోవిడ్ తీవ్రంగా ఉన్నప్పటికీ.. కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలోని ఇడమలక్కుడి పంచాయతీలో ఒక్కరూ వైరస్ బారిన పడలేదు.
కరోనా నిబంధనలు పక్కగా పాటించడం వల్లే.. 2వేల మంది ఉండే ఈ గిరిజన ప్రాంతాన్ని కొవిడ్ తాకలేకపోయిందట. ఇక్కడకు బయటివాళ్లకు అనుమతి ఉండదు.
తమ ప్రాంతానికి ఎవరు రావాలన్నా రాష్ట్ర అటవీ శాఖ నుంచి అనుమతి పొందాల్సిందే అని గ్రామస్థులు అంటున్నారు. ఇక ప్రజలు ఇంట్లోకి కావల్సిన వస్తువులను రాసిస్తే.. అందరి తరఫున ఒకరే వెళ్లి వాటిని తీసుకొస్తారు.
ఆ వ్యక్తి 2వారాలు క్వారంటైన్‌లో ఉంటారు.. ఈ విధమైన కఠిన నిబంధనలు పాటించడం వల్లే ఈ గిరిజనులు ఒక్కరు కూడా కరోనా బారిన పడలేదని సబ్ కలెక్టర్ ప్రేమ్ క్రిష్ణణ్ తెలిపారు.