సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 జనవరి 2024 (12:27 IST)

వృద్ధుడిపై ఎద్దు దాడి.. పొట్టలో తీవ్రగాయం.. మృతి.. ఎక్కడ?

Bull
రోడ్లపై నడవాలంటేనే జనం జడుసుకుంటున్నారు. ఒక వైపు వీధికుక్కల దాడికి ప్రజలు భయపడిపోతున్నారు. దేశంలో
Bull
వీధికుక్కల దాడికి సంబంధించిన ఘటనలు ఎన్నో జరుగుతూనే వున్నాయి. ఢిల్లీ, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లోనే ఇలాంటి ఘటనలు పునరావృత్తం అవుతున్నాయి. తాజాగా ఎద్దుల దాడి ఓ వృద్ధుడిని బలితీసుకుంది. 
 
యూపీలోని బరేలీలో ఉదయం రోడ్డుపై వెళ్తున్న ఓ వృద్ధుడు ఎద్దు పొట్టలో పొడవడంతో మరణించాడు. 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విచ్చలవిడి పశువుల దాడుల సమస్యకు ప్రభుత్వం పరిష్కారం కనుగొనలేకపోయింది. విచ్చలవిడిగా ఎద్దుల దాడిలో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయిన బరేలీలో అలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 
 
ఉత్తరప్రదేశ్‌లో విచ్చలవిడిగా సంచరిస్తున్న పశువుల దాడులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ జంతువుల హింసాత్మక దాడుల్లో చాలా మంది వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు మరియు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విచ్చలవిడి పశువుల దాడుల సమస్యకు ప్రభుత్వం పరిష్కారం కనుగొనలేకపోయింది.  
 
బుధవారం ఉదయం 8 గంటలకు వృద్ధుడు వాకింగ్ వెళ్తుండగా.. ఈ సంఘటన జరిగింది. ఆ వ్యక్తి ఇంటి నుండి కొన్ని అడుగుల దూరంలో వెళ్తుండగానే ఎద్దు కుమ్మేసింది. నిర్జన ప్రాంతంలో నల్లటి ఎద్దు దాడి చేయడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. 
Bull
Bull
 
బరేలీ సమీపంలోని సంజయ్ నగర్ ప్రాంతంలో ఈ ఘటన జరగగా, ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో ఈ విషాద ఘటన రికార్డయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.