ఎస్‌బీఐలోకి ఎంటరైన ఎద్దు.. కౌంటర్ దగ్గర నిలబడి..?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి ఎద్దు ప్రవేశించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నావ్ బ్రాంచ్‌లోకి ఎద్దు ప్రవేశించి బ్యాంకు ఖాతాదారులకు, ఉద్యోగులకు చుక్కలు చూపించింది.
బ్యాంకు లోపల ఒక కస్టమర్ రికార్డ్ చేసిన వీడియోలో, జంతువు కౌంటర్ దగ్గర నిలబడి, లోపల భయాందోళనలను సృష్టిస్తుంది.
బ్యాంక్‌లో ఎద్దు ఒక మూలలో ఓపికగా నిలబడింది. దానిని బయటకు తరిమేందుకు కస్టమర్లు, ఉద్యోగులు ప్రయత్నించారు. తుపాకీ, కర్రతో ఉన్న సెక్యూరిటీ గార్డు చివరకు ఎద్దును బయటికి పంపించాడు.