సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 మే 2023 (12:17 IST)

చెట్టుకొమ్మ విరిగిపడి చిన్నారి మృతి.. నిద్రలోనే తిరిగి రాని లోకాలకు..

హనుమకొండ జిల్లాలో చెట్టుకొమ్మ విరిగిపడి చిన్నారి మృతి చెందింది. చెట్టుకొమ్మ విరిగిపడి నిద్రలోనే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామంలో కన్న రజిత సురేందర్‌లకు ఓ కుమారుడు, ఓ కుమార్తె వున్నారు. 
 
తొమ్మిదేళ్ల కూతురు శ్రీజ ఇంటి ముందు వేప చెట్టు కింద మంచంపై పడుకుంది. ఇవాళ తెల్లవారుజామున అకస్మాత్తుగా వేపచెట్టు నుండి కొమ్మ విరిగి నిద్రపోతున్న శ్రీజపై పడింది. ఈ ఘటనలో ఆ చిన్నారి నిద్రలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.