శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 అక్టోబరు 2023 (16:13 IST)

జూ-ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం: ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ సభ్యుడిగా ఎంపిక

NTR junior
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఇప్పటికే ఎన్నో అవార్డులు, సన్మానాలు అందుకున్న ఈ హీరో తాజాగా మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. ఆస్కార్ తన కొత్త సభ్యుల జాబితాను ప్రకటించింది. 
 
ఇక ఈ లిస్ట్‌లో ఇండియా నుంచి ఎన్టీఆర్‌కి చోటు దక్కింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అకాడమీ కమిటీ స్వయంగా ఓ పోస్ట్ చేసింది. ఇందులో భాగంగా యాక్టర్స్ బ్రాంచ్ సభ్యుడిగా ఎన్టీఆర్‌కు అకాడమీ అరుదైన గౌరవం ఇచ్చింది. 
 
ఇక ఈ జాబితాలో స్థానం సంపాదించి ఆస్కార్ అకాడమీలోని యాక్టర్స్ బ్రాంచ్‌లోకి ప్రవేశించడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా జూ. ఎన్టీఆర్‌ అరుదైన గుర్తింపు సాధించారు.
 
ఈ విషయం తెలియగానే అభిమానులంతా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. మిమ్మల్ని చూస్తే చాలా గౌరవంగా ఉందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో అకాడమీ కొత్త సభ్యుల జాబితాను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.
 
ఆ జాబితాలో భారత్ నుంచి 8 మంది ఉన్నారు. వారిలో 6 మంది ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి చెందినవారు వున్నారు. మిగిలిన ఇద్దరు కరణ్ జోహార్, షౌనక్ సేన్‌లు కావడం విశేషం.