శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 27 మే 2017 (13:57 IST)

ఎన్నికల సంఘం కొత్త రూల్.. రాజకీయ నేతకు ఇద్దరు భార్యలుంటే..?

కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు కొత్త నిబంధన పెట్టింది. ఎన్నికల్లో పోటీచేసే నేతలు తమ ఆదాయ వివరాలతో పాటు భార్య పేరిట గల ఆదాయ వివరాలను కూడా ఈసీకి సమర్పించాలని పేర్కొంది. నామినేషన్లు

కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు కొత్త నిబంధన పెట్టింది. ఎన్నికల్లో పోటీచేసే నేతలు తమ ఆదాయ వివరాలతో పాటు భార్య పేరిట గల ఆదాయ వివరాలను కూడా ఈసీకి సమర్పించాలని పేర్కొంది. నామినేషన్లు వేసే సమయంలోనే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమతో పాటు భార్య పేరిట గల ఆస్తుల వివరాలను కూడా ఇవ్వాలని ఎన్నికల సంఘం తెలిపింది. 
 
ఒకవేళ ఎన్నికల్లో పోటీచేసే రాజకీయ అభ్యర్థులకు ఇద్దరు భార్యలు ఉన్నట్లయితే అందరి ఆదాయ వివరాలు ఇచ్చి తీరాల్సిందేనని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతకు ఇది సహకరిస్తుందని ఎన్నికల సంఘం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇందుకోసం ఎన్నికల అఫిడవిట్‌లో ప్రత్యేక కాలమ్‌ను కూడా ఈసీ ఏర్పాటు చేసింది. 
 
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఆస్తులు, అప్పులు, భార్య, అలాగే తనపై ఆధారపడిన వారి ముగ్గురి ఆస్తులు, అప్పులు ఇవ్వాల్సి ఉంది. కాని తాజాగా ఆదాయ మార్గాలను కూడా ఇవ్వాలని కోరడం ద్వారా రాజకీయ నేతలకు కాస్త సంకటమే ఏర్పడిందని చెప్పాలి. అయినా ఆదాయానికి లెక్క చెప్పడం రాజకీయ నేతలకు ప్రత్యేకంగా చెప్పించాల్సిన అవసరం లేదు.