సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 డిశెంబరు 2023 (12:02 IST)

మిజోరంలో ఓట్ల లెక్కింపు తేదీలో మార్పు.. ఎందుకంటే?

election evm
కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. మిజోరంలో ఓట్ల లెక్కింపు తేదీ మారుస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. మిజోరంలో డిసెంబర్ 3న కాకుండా డిసెంబర్ 4న ఓట్లను లెక్కించనున్నట్లు వెల్లడించింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక కౌంటింగ్ మాత్రమే మిగిలి ఉంది. 
 
డిసెంబర్ 3 ఆదివారం అవుతుంది. ఈ క్రమంలో ఆ రోజు క్రైస్తవులకు పవిత్రమైన రోజు. మిజోరంలో ఎక్కువ సంఖ్యలో క్రైస్తవులు ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ తేదీని మార్చాలని అన్ని పార్టీలు ఈసీకి అభ్యర్థనలను పంపాయి.
 
దీంతో కౌంటింగ్ తేదీని మారుస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మిగతా 4 రాష్ట్రాల్లో డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఈసీ స్పష్టం చేసింది.