ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 21 నవంబరు 2023 (12:21 IST)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: రైతులకు, ఉద్యోగులకు దుర్వార్త

telangana assembly poll
తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు, ఉద్యోగులకు నిజంగానే ఇది బ్యాడ్ న్యూస్, అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో రైతు బంధు, రుణమాఫీ నిధుల విడుదల, ఉద్యోగులకు డీఏ పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపింది. ఇందుకోసం ఎన్నికల సంఘం అనుమతి కూడా కోరింది. అయితే, ఎన్నికల సంఘం మాత్రం ససేమిరా అంది. రైతు బంధు నిధుల మాఫీ, రుణమాఫీతో పాటు.. ప్రభుత్వ ఉద్యోగులకు రుణమాఫీకి అనుమతి ఇవ్వలేదు.
 
రైతు బంధు, రుణమాఫీ అంశాలపై గతంలో ఎన్నికల సంఘాల కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఫిర్యాదు చేశాయి. దీంతో రైతు బంధు నిధుల, రైతు రుణమాఫీతో పాటు ఉద్యోగులకు డీఏ పెంపునకు వీలు పడదని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. కాగా, రైతు బంధు పథకం కింద రైతులకు ప్రభుత్వ ప్రతి యేటా రెండుసార్లు నిధులను విడుదల చేస్తుంది. ఇపుడు రబీ సీజన్ నేపథ్యంలో ఈ రైతు బంధు నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించి, ఎన్నికల సంఘం అనుమతి కోరగా, ఎన్నికల సంఘం నిరాకరించింది.