ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 డిశెంబరు 2021 (08:32 IST)

అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై నేడు తుది నిర్ణయం!

దేశంలో ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి భయపెడుతోంది. రోజురోజుకూ ఈ కేసులు పెరిగిపోతున్నాయి. పలు రాష్ట్రాలకు కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. దీంతో వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను వాయిదావేయాలంటూ ఇటీవల అలహాబాద్ హైకోర్టు సూచన చేసింది. అలాగే, కొన్ని రాజకీయ పార్టీల నేతలు కూడా ఇదే తరహా డిమాండ్ చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై అస్పష్టత నెలకొంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేకంగా సమావేశంకానుంది. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తిపై ఆరా తీయనుంది. ఆ తర్వాత ఈ రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.