బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 6 నవంబరు 2020 (07:55 IST)

ఆయుర్వేద పద్దతుల ద్వారా రోగనిరోధక శక్తి పెంపు

ముఖానికి మాస్కులు ధరించడం, 6 అడుగుల వ్యక్తిగత దూరాన్ని పాటించడం, వస్తువును కానీ, వ్యక్తిని కానీ తాకిన వెంటనే చేతులను సబ్బుతో లేదా శానిటైజర్‌తో శుభ్రపర్చుకోవడం తదితర ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూనే.. ఆయుర్వేద వైద్యాన్ని ఆచరించడం ద్వారా కోవిడ్‌ను ఎదుర్కొనే, త్వరగా కోలుకునే శక్తి సామర్థ్యాలు పెరుగుతాయని కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 

వైరస్ ను ఎదుర్కొనేందుకు మన శరీరంలో తగినంత రోగనిరోధక శక్తి కూడా చాలా అవసరం. శరీర రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవడం ద్వారా కొవిడ్‌ను సమర్థంగా కట్టడి చేయవచ్చని కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ కూడా చెప్పింది. వంటింటి చిట్కాలతో ఎంతో మేలు జరుగుతుందని,  కోవిడ్ సహా కాలానుగుణంగా వచ్చే వ్యాధులను అరికట్టడానికి ఆయుర్వేద విధానాలు అనుసరించాలని సూచించింది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది.

కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆయుష్ మంత్రిత్వశాఖ ఇచ్చిన సూచనలను పాటిస్తూ రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నించాలి. 
 
రోగనిరోధక శక్తిని పెంచుకునే సాధారణ పద్ధతులు: 
 
* దాహం అనిపించినప్పుడల్లా గోరు వెచ్చని నీరు తాగండి
 
* ప్రతి రోజూ కనీసం 30 నిమిషాలు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయండి
 
* రోజువారీ వంటకాలలో పసుపు, జీలకర్ర, దనియాలు, వెల్లుల్లి తప్పకుండా ఉండేలా చూసుకోండి 
 
* ప్రతి రోజు కనీసం 20 నిమిషాల పాటు ఎండలో ఉండండి
 
* పొడి దగ్గు ఉంటే తాజా పుదీనా ఆకులు వేడి నీటిలో వేసుకొని ఆవిరి పీల్చాలి.
 
* కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాతా గోరువెచ్చని నీటినే తాగాలి.
 
* తేలికపాటి వ్యాయామాలు, యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం లాంటివి చేయాలి. 
 
* సులువుగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవాలి.
 
* ధూమపానం, మద్యపానం అలవాట్లను మానుకోవాలి.
 
ఆయుర్వేద పద్ధతుల ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకునే మార్గాలు: 
 
* రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం కోసం ఉదయాన్నే 10 గ్రాముల చ్యవన్‌ప్రాష్‌ తీసుకోవాలి. మధుమేహులైతే తీపి లేని చ్యవన్‌ప్రాష్‌ను స్వీకరించాలి.
 
* గోరు వెచ్చని నీటిలో తగినంత పసుపు వేసి రోజూ ఉదయం, సాయంత్రం తాగాలి.
 
* తులసి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, శొంఠి, ఎండు ద్రాక్ష మొదలైనవాటితో చేసిన ఆయుర్వేద తేనీరు రోజుకు ఒకటి లేదా రెండుసార్లు తాగండి. అలాగే మీ అభిరుచిని బట్టి బెల్లం లేదా తాజా నిమ్మరసాన్ని కలుపుకోవచ్చు. 
 
* 150 మిల్లీ లీటర్ల పాలలో అరస్పూను పసుపు కలుపుకొని రోజుకు ఒకటి లేక రెండుసార్లు తాగండి.
 
* ఆయుష్‌ క్వాత్, సంషమణివతి, అశ్వగంధ తదితర ఔషధాలను ఆయుర్వేద వైద్యుల సూచనల మేరకు తగు మోతాదులో వాడాలి.
 
సులభమైన ఆయుర్వేద పద్ధతులు: 
*  నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె లేదా నెయ్యిని ముక్కు రంధ్రాల దగ్గర పట్టించండి. ఇలా ఉదయం మరియు సాయంత్రం చేయండి
 
*  ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె తీసుకుని నోటిలో వేసుకుని రెండు, మూడు నిమిషాలు పుక్కిలించి తర్వాత ఊసేయాలి. ఆ తరువాత వెంటనే నోటిని గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇలా రోజుకు ఒకటి రెండుసార్లు చేయవచ్చు.
 
* పొడిదగ్గు ఉంటే పుదీనా ఆకులను లేదా సోపు గింజలు కలిపిన నీటి ఆవిరిని రోజుకు ఒకసారి పీల్చుకోవాలి
 
*  లవంగాల పొడిని బెల్లంతో లేదా తేనెతో కలుపుకుని రోజుకు రెండుసార్లు తీసుకుంటే దగ్గు లేదా గొంతు గరగర నుంచి ఉపశమనం లభిస్తుంది.
 
*  ఒకవేళ పొడి దగ్గు ఎక్కువగా ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి
 
క్యారెట్లు, ఆకుకూర‌లు:
క్యారెట్లు, ఆకుకూర‌ల్లో విట‌మిన్-ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. ర‌క్తంలో ఉండే విష ప‌దార్థాలు, సూక్ష్మక్రిములు తొల‌గిపోతాయి. క్యారెట్లతోపాటు ఆకుకూర‌లు, చిల‌గ‌డ‌దుంప‌,  కీరాదోస‌, మామిడి పండ్లు, క‌ర్బూజా పండ్లలో, యాప్రికాట్లలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మ‌న శ‌రీరంలో విట‌మిన్-ఎ గా మారి మ‌నలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది.
 
నారింజ‌, ద్రాక్ష:
మ‌న శ‌రీరంలో రోగ నిరోధ‌క క‌ణాల‌ను, తెల్ల ర‌క్త క‌ణాల‌ను వృద్ధి చేసేందుకు విట‌మిన్-సి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ద్రాక్ష, నారింజ‌, బ‌త్తాయి పండ్లు, కివీలు, స్ట్రాబెర్రీలు, బెంగ‌ళూరు క్యాబేజీ, క్యాప్సికం, మిరియాలు, ఉడ‌క‌బెట్టిన క్యాబేజీ, కాలిఫ్లవర్‌ల‌లో మ‌న‌కు విట‌మిన్-సి అధికంగా ల‌భిస్తుంది. దీంతో శరీర రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది.
 
కోడిగుడ్లు, పాలు:
బాక్టీరియా, వైర‌స్‌లు ర‌క్తంలో ఇన్ఫెక్షన్లను క‌లిగిస్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే విట‌మిన్-డి త‌గినంత‌గా ఉంటే ఆ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అందుకు విట‌మిన్ డి ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. ఇది మ‌న‌కు సూర్యర‌శ్మి ద్వారా ల‌భిస్తుంది. అలాగే చేప‌లు, గుడ్లు, పాలు, చీజ్‌, వెన్న, ప‌నీర్‌, పుట్టగొడుగులలోనూ విట‌మిన్-డి ల‌భిస్తుంది. వీటిని త‌ర‌చూ తీసుకోవ‌డం ద్వారా శ‌రీరంలో ఇన్‌ఫెక్ష‌న్లు ఏర్ప‌డ‌కుండా చూసుకోవ‌చ్చు. అలాగే రోగ నిరోధ‌క వ్యవ‌స్థ ప‌టిష్టమ‌వుతుంది.
 
పౌల్ట్రీ ఉత్పత్తులు, సోయా:
పౌల్ట్రీ ఉత్పత్తులు, సోయాబీన్‌, మాంసం, శ‌న‌గ‌లు, చిక్కుడు జాతి గింజ‌లు, చిరు ధాన్యాలు, గింజ‌లు, చీజ్, ప‌నీర్‌, పెరుగుల‌లో జింక్ ఎక్కువ‌గా ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు జింక్ ల‌భిస్తుంది. దీంతో శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.