ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 31 మే 2024 (10:45 IST)

రాత్రి భోజనం పెట్టలేదనే కోపంతో తల నరికి హత్య.. చర్మం ఒలిచి..?

crime
కర్ణాటకలో దారుణం వెలుగు చూసింది. భార్య తనకు రాత్రి భోజనం పెట్టలేదనే కోపంతో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి ఆమె తల నరికి హత్య చేశాడు. ఈ ఘటన తుముకూరు జిల్లాలో సోమవారం ఈ ఘటన వెలుగు చూసింది.
 
వివరాల్లోకి వెళితే.. కునిగల్ తాలూకాకు చెందిన శివరామ, పుష్పలతకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఎనిమిదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. భార్యాభర్తలు తరచూ గొడవపడుతుండేవారు. 
 
కాగా, సోమవారం రాత్రి కూడా వారు గొడవపడ్డారు. ఆ రాత్రి ఆమె అతడికి భోజనం పెట్టలేదు. దీంతో, తీవ్ర ఆగ్రహంలో విచక్షణ మరిచిన శివరామ కత్తితో ఆమె తల నరికేశాడు. 
 
ఆ తరువాత ఆమె చర్మం మొత్తం రాత్రంతా ఒలిచాడు. ఆమె మృతదేహాన్ని ముక్కలు చేశాడు. మరునాడు ఉదయం తను పని చేస్తున్న సంస్థ యజమానులకు సమాచారం అందించాడు. ఘటన జరిగిన సమయంలో వారి కుమారుడు నిద్రిస్తున్నాడు. 
 
కాగా, ఘటన స్థలిలో తమకు మహిళ మృతదేహం రక్తపు మడుగులో కనిపించిందని పోలీసులు చెప్పారు. నిందితుడు ఆమె చర్మం పూర్తిగా ఒలిచాడని తెలిపారు. నిందితుడు కూడా అక్కడే ఉన్నాడని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.