ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2024 (09:11 IST)

కర్ణాటక షాకింగ్ ఘటన.. బొట్టు వద్దు బురఖా.. భర్త కళ్ల ముందే..?

woman
కర్ణాటక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 28 ఏళ్ల వివాహిత భర్త కంటిముందే అత్యాచారానికి గురైంది. తనపై అత్యాచారం, బలవంతపు మతమార్పిడి జరిగిందంటూ ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. రఫీక్, అతడి భార్య ఆమెను ఉచ్చులోకి దింపి లైంగిక చర్యల్లో పాల్గొన్నారు నిందితులు. ఆపై మతమార్పిడి కోసం బెదిరించారు. 
 
వ్యక్తిగత ఫోటోలను నెట్‌లో పెడతామని బెదిరించారు. బాధితురాలిని హిందూమతం నుంచి ఇస్లాంలోకి మారాలంటూ బలవంతం చేశారు. తాము చెప్పిందల్లా వినాలని ఒత్తిడి చేశారని పేర్కొంది. గతేడాది రఫీక్ తనను అతడి భార్య ముందే బలాత్కరించాడని ఆరోపించింది.
 
భర్తకు విడాకులు ఇవ్వమని నిందితుడు తనను బలవంతం పెట్టాడని పేర్కొంది. ఈ ఏప్రిల్‌లో వారు తనను నుదుట కుంకుమ ధరించొద్దని ఆదేశించారని చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేశారు.