1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 ఏప్రియల్ 2024 (20:59 IST)

కర్ణాటకలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

revanth reddy
కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిమిత్తం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సాయంత్రం బెంగళూరు చేరుకున్నారు. సర్వజ్ఞనగర్‌లో రోడ్‌షో నిర్వహించి, అనంతరం మార్తన్‌హళ్లిలో బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం హొంగసంద్రలో జరిగే కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొంటారు. 
 
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున వివిధ రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. గతంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు తరపున ప్రచారం నిర్వహించారు.