శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 డిశెంబరు 2019 (09:37 IST)

కన్నకూతురిపై తండ్రి అఘాయిత్యం.. ఫూటుగా తాగి..?

కన్నకూతురిపై తండ్రే ఘాతుకానికి పాల్పడ్డాడు. ఎనిమిదేళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌లో చోటుచేసుకుంది. కూలీగా పనిచేసే తండ్రి రోజూ తాగొచ్చి కూతుర్ని చితకబాదేవాడు. ఓ రోజు ఫుల్లుగా తాగి ఇంటికి వచ్చి కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
అయితే.. చైల్డ్ కేర్ సెంటర్‌కు అజ్ఞాత వ్యక్తి నుంచి కాల్ రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాధిత బాలిక ఇంటిలో సోదాలు నిర్వహించగా బాలిక అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. ఆమె అత్యాచారానికి గురైనట్లు తేలింది. బాలికను విచారించగా.. జరిగిన విషయమంతా చెప్పడంతో, నిందితుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.