శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 18 మే 2018 (13:16 IST)

మా వైపు 6 కోట్ల మంది ఉన్నారు.. అసెంబ్లీలో విజయం మాదే : బీజేపీ కర్ణాటక శాఖ

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప శనివారం అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకుంటారని, తమ వైపున ఆరు కోట్ల కన్నడికులు ఉన్నారంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పేర్కొంది. ఈ మేరకు ఓ ట్వీట్

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప శనివారం అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకుంటారని, తమ వైపున ఆరు కోట్ల కన్నడికులు ఉన్నారంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పేర్కొంది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది.
 
శనివారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రభుత్వం అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలంటూ సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ ఆదేశాలు బీజేపీకి ఏమాత్రం మింగుడుపడలేదు. అయినప్పటికీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఆ పార్టీ కర్ణాటక శాఖ ట్విట్టర్‌లో ఓ ట్వీట్ చేసింది. సభలో బలం నిరూపించుకునే విషయంలో తమకు ఎలాంటి భయం లేదన్నారు. బలపరీక్షలో నెగ్గుతామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. తమకు తగిన సంఖ్యా బలం ఉందని ప్రకటించింది. 
 
జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉన్న విషయం వారికి తెలుసునని, అది రేపు ప్రపంచానికి తెలుస్తుందన్నారు. మా బలంపై సందేహం ఉన్న వారికి చెప్పేదొకటే వేచి చూడండని అని పోస్ట్‌లో పేర్కొంది. 6 కోట్ల మంది కన్నడిగుల ఆశీర్వచనాలు తమకు ఉన్నాయని, వారి దీవెనలను గౌరవిస్తామని, వారి ఆకాంక్షలను నెరవేరుస్తామని ప్రకటించింది.