మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 డిశెంబరు 2023 (11:38 IST)

సలాడ్‌లో ఒక వ్యక్తి చేతి వేలు.. మహిళకు షాకింగ్ అనుభవం

salad
అమెరికాలో ఓ మహిళకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆమె రెస్టారెంట్‌లో ఆర్డర్ చేసిన సలాడ్‌లో ఒక వ్యక్తి వేలు ఉందని గుర్తించిన ఆమె చివరకు రెస్టారెంట్ యజమానిపై కోర్టును ఆశ్రయించింది. ఈ ఘటన న్యూయార్క్ నగరంలో వెలుగు చూసింది. 
 
వివరాల్లోకి వెళితే.. గ్రీన్విచ్‌కు చెందిన అల్లిసన్ కోజీ ఏప్రిల్ 7న న్యూయార్క్‌లోని ప్రముఖ చోప్ట్ రెస్టారెంట్‌కి వెళ్లి సలాడ్‌ను ఆర్డర్ చేసింది. అయితే, సలాడ్ తింటున్నప్పుడు, ఆమె ఆ వ్యక్తి వేలిని నమిలినట్లు గ్రహించి షాక్ అయ్యింది. దీంతో ఆమె ఆ రెస్టారెంట్‌పై కోర్టులో కేసు వేసింది.
 
కేసు వివరాల ప్రకారం.. ఘటనకు ముందు రోజు కూరలు వండుతుండగా ప్రమాదవశాత్తు రెస్టారెంట్ సిబ్బందిలో ఒకరి వేలి తెగిపోయింది. బాధితుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో తెగిపడిన వేలు సలాడ్‌లో కలిసిపోయింది. 
 
కాగా, స్థానిక ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికే రెస్టారెంట్‌కు జరిమానా విధించారు. అయితే ఈ ఘటన వల్ల శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడ్డానని బాధితురాలు తన పిటిషన్‌లో పేర్కొంది. 
 
రెస్టారెంట్ చైన్ యాజమాన్యం తనకు నష్టపరిహారాన్ని నగదు రూపంలో చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ పరిణామంపై రెస్టారెంట్ నిర్వాహకులు ఇంకా స్పందించలేదు.