శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 నవంబరు 2023 (22:34 IST)

సినిమాలు ఇక వద్దనుకుంటున్న సమంత.. నిజమేనా?

Samantha Ruth Prabhu
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసైటిస్ కోసం చికిత్స తీసుకుంటోంది. ఇందుకోసం సినిమాలకు ఏడాది పాటు గ్యాప్ ఇచ్చింది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెరపైకి వచ్చిన సమంత అగ్రహీరోల సరసన నటించి టాప్ హీరోయిన్‌గా నిలిచింది. 
 
కెరియర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు ఉన్నాయి. కెరీర్ పీక్ దశలో వుండగా తన తొలి చిత్రం ఏ మాయ చేసావె కో స్టార్ కమ్ లవర్ అక్కినేని నాగచైతన్యను సమంత పెళ్లి చేసుకుంది.కానీ ఊహించని విధంగా 2021లో ఈ జంట విడిపోయారు.
 
విడాకుల తర్వాత కెరియర్‌పై సమంత దృష్టి పెట్టింది. ఇంతలో సమంత అనారోగ్య కారణంతో బాగా డిస్టర్బ్ అయింది. ఆపై ఆమె నటించిన యశోద, శకుంతల చిత్రాలు ఊహించిన ఫలితాన్ని అందించలేదు. ఇక రీసెంట్‌గా విజయ్ దేవరకొండతో నటించిన రొమాంటిక్ మూవీ ఖుషి కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు. సినిమాలతో పాటు సమంత వెబ్ సిరీస్‌ లో కూడా దూసుకుపోతుంది. 
 
ఈ నేపథ్యంలో సమంత గురించి ఒక చిన్న గాసిప్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం సమంత తన సినీ కెరియర్‌కు బైబై చెప్పాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.