గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (11:42 IST)

త్రిశూర్‌లో ఏనుగు దాడి-ఐదేళ్ల బాలిక మృతి, తండ్రి, తాతకు గాయాలు

త్రిశూర్‌లో జరిగిన ఏనుగుదాడిలో ఐదేళ్ల బాలిక మృతి చెందింది. ఇంకా ఆమె తండ్రి, తాతకు గాయాలైనాయి. వివరాల్లోకి వెళితే.. అతిరప్పిల్లి సమీపంలోని కన్నన్‌కుజి వద్ద సోమవారం ఐదేళ్ల బాలికను అడవి ఏనుగు దాడి చేసి చంపేసింది. 
 
మృతురాలిని మాలా స్థానిక నిఖిల్ కుమార్తె అగ్నిమియగా గుర్తించారు. ఈ దాడిలో నిఖిల్, బావ జయన్‌లకు కూడా గాయాలయ్యాయి. వారిని చాలక్కుడి సెయింట్ జేమ్స్ ఆసుపత్రికి తరలించారు. 
 
కుటుంబం బంధువులతో కలిసి గార్డెన్‌లో వున్నప్పుడు ఏనుగు దాడి చేసింది. ఏనుగు చూసి పారిపోతుండగా వారిపై తొండంతో దాడి చేసింది.  బాలిక పరిగెత్తినప్పుడు అది తొక్కి చంపేసింది.