శుక్రవారం, 25 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 30 ఆగస్టు 2016 (13:44 IST)

ఎక్కువ వయసున్న భార్యతో భర్త లైంగికచర్య రేప్‌గా చూడలేం : కేంద్రం

వయసు ఎక్కువ ఉన్న భార్యతో భర్త జరిపే లైంగిక చర్య అత్యాచారం కిందకు రాదనీ ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం నివేదిక రూపంలో తెలిపింది.

వయసు ఎక్కువ ఉన్న భార్యతో భర్త జరిపే లైంగిక చర్య అత్యాచారం కిందకు రాదనీ ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం నివేదిక రూపంలో తెలిపింది. ఐపీసీ సెక్షన్ 375ను సవాల్ చేస్తూ ఒక స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజాప్రయోజనవ్యాజ్యంపై సోమవారం.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీ రోహిణి నేతృత్వంలోని ధర్మాసనం వాదనలను ఆలకించింది. 
 
ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం తన వాదనలను వినిపించింది. 15 సంవత్సరాలకన్నా ఎక్కువ వయసున్న భార్యతో భర్త లైంగికచర్యలో పాల్గొనటం అత్యాచారం కిందికి రాదని ఢిల్లీ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఐపీసీ సెక్షన్ 375లో ఉన్న రెండో మినహాయింపును కేంద్రం సమర్థిస్తూ వాదనలు వినిపించింది. దేశంలో ఉన్న సంప్రదాయాలకు అనుగుణంగా ఉండే భార్యభర్తల సంబంధాల దృష్ట్యా ఈ మినహాయింపు ఉందని తెలిపింది.