శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2020 (18:12 IST)

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూసారు. గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ బారిన పడి ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రణబ్ ముఖర్జీ తుది శ్వాస విడిచారు. ఆదివారం నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించిందని ఆర్మీ ఆస్పత్రి సోమవారం ప్రకటించిన సంగతి విదితమే. ఈ నెల ఐదో తారీఖు ఆయన కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
 
కరోనా సమయంలోనే ఆయనకు శస్త్ర చికిత్స కూడా చేసారు. చికిత్స చేస్తున్న సమయంలోనే ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి కోమాలోనే ఉన్నారు. 1935 డిసెంబర్ 11 న ఆయన జన్మించారు. ఆయనను ముద్దుగా దాదా అని పిలుస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ మరణించారని ఆయన కుమారుడు తెలిపారు. 

తన తండ్రి చనిపోయారన్న వార్తను బరువెక్కిన హృదయంతో వెల్లడిస్తున్నట్లు ప్రణబ్ కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్వీట్ చేశారు. డాక్టర్ల కృషితో పాటు దేశప్రజలంతా ప్రార్థనలు చేసినప్పటికీ ఆయన మనల్ని విడిచి వెళ్లిపోయారని పేర్కొన్నారు.