బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 ఫిబ్రవరి 2024 (12:51 IST)

రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రికి ఒకేసారి కరోనా, స్వైన్ ఫ్లూ

coronavirus
రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా స్వయంగా ధ్రువీకరించారు. రోనాతో పాటు స్వైన్ ఫ్లూ కూడా ఉందని చెప్పారు.  కొన్ని రోజులుగా తాను జ్వరంతో బాధపడుతున్నానని... డాక్టర్ల సలహా మేరకు కోవిడ్ టెస్ట్ చేయించుకున్నానని... టెస్టులో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని తెలిపారు. 
 
కరోనా కారణంగా ఏడు రోజుల పాటు ఇంట్లోనే క్వారంటైన్ లో వుంటానని.. ఎవరినీ కలబోనని స్పష్టం చేశారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  అంతా ఆరోగ్యం విషయంలో తగిన శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని అశోక్ గెహ్లాట్ హితవు పలికారు.