శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 9 జులై 2017 (09:59 IST)

ఢిల్లీ వాసులకు కేజ్రీవాల్ వరం.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత చికిత్సలు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ రాష్ట్ర ప్రజలకు ఓ వరం ప్రకటించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు ఆలస్యమవుతున్నాయని భావించిన వారు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వాటిని ఉచితంగా చేయించుకోవచ్చని

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ రాష్ట్ర ప్రజలకు ఓ వరం ప్రకటించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు ఆలస్యమవుతున్నాయని భావించిన వారు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వాటిని ఉచితంగా చేయించుకోవచ్చని ఆయన ప్రకటించారు. ఇందుకోసం 48 ప్రైవేటు ఆసుపత్రులను ఎంపిక చేశామని, ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, నోయిడా తదితర ప్రాంతాల్లో 24 ప్రభుత్వ ఆసుపత్రులు రిఫర్ చేసే రోజులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లవచ్చని తెలిపారు.
 
ముఖ్యంగా... బైపాస్, కిడ్నీ, ప్రొస్టేట్, థైరాయిడ్ సహా 52 రకాల లైఫ్ సేవింగ్ సర్జరీస్ చేయించుకోవచ్చని ఆయన తెలిపారు. నెల రోజుల వ్యవధిలో శస్త్రచికిత్సకు డేట్ లభించని వారంతా ఈ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు అర్హులని వివరించారు. ఈ ఉచిత చికిత్సల కోసం వారివారి ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చన్నారు.