ఎయిర్‌పోర్టుల్లో ఫుల్‌బాడీ స్కానింగ్ యంత్రాలతో చీరకుచ్చిళ్లు... మంగళసూత్రాలకు చిక్కు... ఎలా?
దేశంలోని విమానాశ్రయాల్లో చెకింగ్‌కు ఓ చిక్కు వచ్చిపడింది. విమానం ఎక్కేముందు తనిఖీల కోసం తడిమి చూసే పద్ధతికి స్వస్తి చెప్పేలా.. డిసెంబర్ నుంచి ఫుల్ బాడీస్కానర్లను పరీక్షిస్తున్నారు. ఇందుకోసం తొలివిడతగా
దేశంలోని విమానాశ్రయాల్లో చెకింగ్‌కు ఓ చిక్కు వచ్చిపడింది. విమానం ఎక్కేముందు తనిఖీల కోసం తడిమి చూసే పద్ధతికి స్వస్తి చెప్పేలా.. డిసెంబర్ నుంచి ఫుల్ బాడీస్కానర్లను పరీక్షిస్తున్నారు. ఇందుకోసం తొలివిడతగా అమెరికా నుంచి తెచ్చిన ఫుల్ బాడీస్కానర్‌ను దేశరాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టులో ట్రయల్ కోసం అమర్చారు.
గత నెల రోజులుగా సుమారు 10 వేల మందిని స్కాన్ చేసింది. అయితే, అద్దాలు, మెటల్ డిజైన్‌లతో కుట్టుపని చేసిన చీరలు, సంప్రదాయకమైన మంగళసూత్రాలకు ఈ స్కానర్ల వల్ల పెద్దచిక్కే వచ్చిపడింది. ఫుల్ బాడీస్కానర్లో తనిఖీల కోసం మంగళసూత్రం, నగలు తీసి పక్కేనే ట్రేలో పెట్టాలి.
అయితే మనదేశంలో తాళిబొట్టుకున్న ప్రాధాన్యత దృష్ట్యా మంగళసూత్రం తీసిపక్కనబెట్టేందుకు మహిళలు ఇష్టపడటం లేదు. దీంతో స్కానర్ పదే పదే అలారం మోగిస్తోందట. అంతేనా చీర మడతలు, కుచ్చిళ్ల కారణంగా చీరలను కూడా స్కానర్ సరిగా తనిఖీ చేయలేకపోతోందట. దీంతో చాలామంది ఫుల్‌బాడీ స్కానర్లకంటే పాతపద్ధతిలోనే తనిఖీకి ఇష్టపడుతున్నట్టు సమాచారం.
దీనిపై ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ... ‘‘స్కానింగ్ కోసం శరీరంపై నగలు ఏమీ లేకుండా చూసుకోవాలి. పురుషులైతే బెల్టులు, వ్యాలెట్లు.. స్త్రీలైతే మంగళసూత్రం తీసి పక్కన ట్రేలో పెట్టాలి. ప్రస్తుతం స్కానింగ్ ఓ ఆప్షన్‌గా మాత్రమే ఉంది. అయితే స్కానింగ్‌ను తప్పనిసరి చేయాల్సి వస్తే మాత్రం మహిళా ప్రయాణికులను ఒప్పంచడం పెద్దసవాలుగా మారుతుంది’’ అని అధికారులు వెల్లడించారు.