గౌరీ లంకేష్‌లా ప్రకాష్ రాజ్‌ను హతమార్చేందుకు కుట్ర.. నా స్వరం మూగబోదు..
కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఎండగట్టే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. ప్రస్తుతం మతం రంగు పులుముకునే రాజకీయ విధానాలపై ఇంతవరకే ప్రకాష్ మండిపడ్డారు. ఇంకా సామాజిక అంశాలు, సమస్యలపై అప్పటికప్పుడు స్పందించే ప్రకాష్
కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఎండగట్టే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. ప్రస్తుతం మతం రంగు పులుముకునే రాజకీయ విధానాలపై ఇంతవరకే ప్రకాష్ మండిపడ్డారు. ఇంకా సామాజిక అంశాలు, సమస్యలపై అప్పటికప్పుడు స్పందించే ప్రకాష్ రాజ్‌ను హతమార్చేందుకు కుట్ర జరుగుతుందనే షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలోని గౌరీ లంకేష్‌ను చంపిన నిందితుల నుంచి కొన్ని భయంకర నిజాలను పోలీసులు రాబట్టారు.
నటుడు ప్రకాష్ రాజ్‌ను అంతమొందించేందుకు కుట్ర జరిగినట్టు రాష్ట్ర సిట్ పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. గౌరీ లంకేష్ హత్యకు పాల్పడినవారే ఇందులో ప్రధాన పాత్రధారులుగా వున్నారు. ఇంకా ఈ వివరాలను ఉటంకిస్తూ.. ప్రముఖ కన్నడ టీవీ ప్రసారం చేసింది. ప్రకాష్ రాజ్‌నే కాకుండా.. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత గిరీష్ కర్నాడ్‌ను కూడా అంతమొందించాలని కుట్ర పన్నినట్టు తెలిసింది. గౌరీ లంకేష్ హత్య తర్వాత ప్రకాష్ రాజ్ హిందూ వ్యతిరేక ప్రకటనలు చేయడమే ఇందుకు కారణమని గౌరీ లంకేష్ హత్య కేసు ప్రధాన నిందితుడు పరశురామ్ వాఘ్మోర్ చెప్పాడు.
అయితే, దీనిపై నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగానే స్పందించాడు. భిన్నాభిప్రాయం కలిగిన వారిని హతమార్చడం పరిష్కారం కాదని, ఈ విధమైన ఆలోచనలు విషపూరితమైనవిగా పేర్కొన్నాడు. తాను మతానికి వ్యతిరేకమైన ఏ ప్రకటనలు చేయలేదని, కాకపోతే మతాలను రాజకీయం చేయడాన్ని వ్యతిరేకించానని చెప్పాడు. తన స్వరాన్ని మూగబోయేలా చేద్దామనుకుంటున్నారని, ఇక మీదట మరింత బలంగా మారుతుందంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశాడు.