బిపిన్ రావత్‌కు దేశ ప్రజల ఘన నివాళి.. భరత భూమి పుత్రుడంటూ నినాదాలు
తమిళనాడు రాష్ట్రంలో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో అశువులుబాసిన త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్‌కు దేశ ప్రజలు ఘన నివాళులు అర్పించారు. భరతభూమి పుత్రుడు రావత్ అమర్ రహే అంటూ నినాదాలతో హోరెత్తించారు.
బుధవారం మధ్యాహ్నం నీలగిరి జిల్లా కాట్టేరి అటవీ కొండ ప్రాంతంలో రక్షణ శాఖకు చెందిన హెలికాఫ్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్, మరో 11 మంది రక్షణ సిబ్బంది మృత్యువాతపడ్డారు.
ఇందులో బిపిన్ రావత్ దంపతులు, లాన్స్ నాయక్ లిద్దర్ మృతదేహాలను మాత్రమే గుర్తించారు. మగిలిన వారి మృతదేహాలు గుర్తించలేనంతగా కాలిపోయాయి. దీంతో ఈ మృతదేహాలకు, వారి కుటుంబ సభ్యులు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇదిలావుంటే, బిపిన్ రావత్ దంపతుల అంతిమయాత్రం శుక్రవారం మధ్యాహ్నం కామరాజర్ మార్గ్‌లోని ఆయన నివాసం నుంచి ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న బ్రార్ స్క్వేర్‌లోని శ్మశానవాటిక వరకు సాగనుంది. ఈ శ్మశానవాటికలో వారిద్దరి అంత్యక్రియలు నిర్వహిస్తారు.
ఈ వీరనాయకుడికి అంతమ వీడ్కోలు పలికేందుకు జనం భారీగా తరలివచ్చారు. పార్థివదేహంతో వెళుతున్న వాహనంపై పూల వర్షం కురిపించారు. కొందరు యువత జాతీయ జెండాను చేతుల్లో పట్టుకుని ఆ వాహనం వెంట నడిచారు. భరతభూమి పుత్రుడు అమరరహే, ఇండియన్ ఆర్మీ జిందాబాద్, వందేమాతరం అంటూ నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. చేశారు.