ఆదివారం, 29 జనవరి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated: గురువారం, 1 డిశెంబరు 2022 (19:59 IST)

లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ముగ్గురు బాలికలు.. 25 నిమిషాల తర్వాత?

lift
lift
ఉత్తరప్రదేశ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లోని లిఫ్ట్‌లో ముగ్గురు బాలికలు ఇరుక్కుపోయిన ఘటన సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని ఒక భవనంలో ఎలివేటర్ ఉంది. ఇందులో ముగ్గురు బాలికలు వెళ్లగా ఒక్కసారిగా లిఫ్ట్‌ సగంలో ఆగిపోయింది. దీంతో షాక్‌కు గురైన ముగ్గురు బాలికలు కేకలు వేశారు. 
 
ముగ్గురు బాలికలు లిఫ్ట్‌లో సగంలోనే ఇరుక్కుపోయిన ఘటన సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యింది.  దాదాపు 25 నిమిషాల తర్వాత లిఫ్ట్‌ ఆగిపోయిందని సమీప వాసులు తెలుసుకుని బాలికలను రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.