1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 18 అక్టోబరు 2016 (09:20 IST)

మాయమాటలు చెప్పిన లాడ్జీకి తీసుకెళ్లి.. స్నేహితులతో కలిసి ప్రేయసిపై ప్రియుడి అత్యాచారం

తమిళనాడు రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలిపై.. స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. దీనికి సంబంధించి నాగర్‌కోవిల్‌లోని ఓ లాడ్జిలో ఓ కాలేజీ విద్యార

తమిళనాడు రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలిపై.. స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. దీనికి సంబంధించి నాగర్‌కోవిల్‌లోని ఓ లాడ్జిలో ఓ కాలేజీ విద్యార్థినిని నిర్బంధించి అత్యాచారం జరిపిన ఆమె ప్రేమికుడు సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
నాగర్‌కోవిల్‌లోని ఓ కాలేజీలో బీఏ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఈ నెల ఉన్నట్టుండి కనిపించక పోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి గాలించగా ఆమె లాడ్జిలో నిర్బంధంలో ఉన్నట్టు తెలిపారు. 
 
పోలీసులు జరిపిన విచారణలో అసలు విషయం బట్టబయలైంది. ఆ విద్యార్థినిని మాయమాటలతో లాడ్జికి తరలించిన ప్రేమికుడు సురేశ్ అత్యాచారం జరిపాడని, ఆ తర్వాత తన స్నేహితులు గోపాల్‌, దినేశ్, జ్ఞానప్రవీణ్‌ అనే ముగ్గురిని పిలిపించి వారితో ఈ నీచపు పనికి ఒడిగట్టాడు. వారితో ఆమెపై అత్యాచారం జరిపి పారిపోయినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నలుగురిని అరెస్టు చేశారు.