సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 4 ఆగస్టు 2024 (18:38 IST)

సెల్ఫీ తీసుకుంటూ 150 అడుగుల లోయలో పడిపోయింది.. (video)

selfie
selfie
మహారాష్ట్రలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని బోర్న్ ఘాట్ వద్ద  సెల్ఫీ తీసుకుంటుండగా ఓ మహిళ 150 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. అడ్వెంచర్లు,   పర్వతారోహకులతో కూడిన రెస్క్యూ టీమ్ ఆ మహిళను రక్షించింది. 
 
ఈ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తున్న పూణేకు చెందిన ఎనిమిది మంది బృందంలో ఆమె భాగం. సెల్ఫీ తీసుకుంటూ ఓ మహిళ 150 అడుగుల లోతున్న గుంతలో పడిపోయింది. 
 
రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని మహిళను సురక్షితంగా ప్రాణాలతో కాపాడింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ ఈ వీడియోలో ఆమెను ఓ మందపాటి తాడుతో కాపాడినట్లు తెలుస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.