గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 23 జులై 2024 (09:49 IST)

ఎలుకల మందు తాగిన బెల్ట్ షాపు యజమాని.. ఎందుకో తెలుసా? (Video)

belt shop owner
తెలంగాణా రాష్ట్రంలో ఓ బెల్ట్ షాపు యజమాని ఎలుకల మందు సేవించాడు. తనకు మద్యాన్ని అధిక ధరకు విక్రయిస్తున్నారంటూ ఓ సెల్ఫీ వీడియోలో పేర్కొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పెద్దపల్లి - సుల్తానాబాద్ మండలం మియ్యాపూర్‌కు చెందిన ఓ బెల్టు షాపు నిర్వాహకుడు సుల్తానాబాద్ వైన్స్ షాపుల్లో మద్యం కొనుగోలు చేసి గ్రామంలో విక్రయిస్తుంటాడు. 
 
అయితే కొద్దిరోజులుగా వైన్స్ షాప్ నిర్వాహకులు అందరూ సిండికేట్ అయి బెల్టు షాపులకు అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. తాను తీవ్రంగా నష్టపోతున్న. బాధ భరించలేక శీతలపానీయంలో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్మ చేసుకుంటున్న అని చెప్పిన సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.