ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 జులై 2024 (12:36 IST)

ఉజ్జయినీ మహంకాళి ఆలయం- మాతంగి స్వర్ణలత భవిష్యవాణి.. లేదంటే సోమరిపోతులు?

Bhavishyavani
Bhavishyavani
సుప్రసిద్ధ సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఆలయ నిర్వాహకులు. బోనాల పండుగ మరుసటి రోజు ఈ కార్యక్రమం జరగడంతో భవిష్యవాణి వినేందుకు భక్తులు ఆసక్తిగా తరలివచ్చారు. అమ్మవారి ముందు పచ్చని కుండపై నిల్చుని స్వర్ణలత భక్తులకు భవిష్యవాణి వినిపించారు.
 
ఈ ఏడాది మంచి వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని హామీ ఇచ్చారు. ఇప్పటికే పలువురు భక్తులు వర్షంలో తడుస్తూ అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. తనను దర్శనం చేసుకోవాలంటే ఆ మాత్రం కష్టపడాలి. లేదంటే సోమరిపోతులు అవుతారని ఆమె తెలిపారు.

ఇంకా, ఈ సంవత్సరం ఐదు వారాల పాటు భక్తులు ప్రార్థనలు చేయాలని అమ్మవారు సూచించారు. అమ్మవారి మార్గదర్శనానికి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె సూచనలను శ్రద్ధగా పాటిస్తానని ప్రమాణం చేశారు. ఈ ఏడాది పూజలు సంతోషంగా ఆనందంగా అందుకున్నానని అమ్మవారు తెలిపారు. ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నానని చెప్పారు.