బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 17 జూన్ 2021 (23:18 IST)

వ్యాక్సినేషన్ లో గోవా ప్రథమ స్థానం

వ్యాక్సినేషన్ ప్రక్రియలో గోవా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్ర జనాభాలో 37.35 శాతం మందికి కనీసం ఒక్క టీకా డోసు అయినా అందేలా అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

సిక్కిం, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. సిక్కింలో 37.29 శాతం, హిమాచల్ ప్రదేశ్‌లో 30.55 శాతం ప్రజలకు తొలి టీకా డోసు అందింది. పలు మార్లు కరోనా దాడి ఎదుర్కొన్న కేరళలో 26.3% మందికి తొలి టీకా డోసు అందింది.

ఇక రాజధాని ఢిల్లీలో 25.39 శాతం మంది తొలి డోసు తీసుకున్నారు. టీకా కార్యక్రమం అమలుకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం మధ్య అభిప్రాయబేధాలు పొడచూపిన విషయం తెలిసిందే.

తెలంగాణాలో 19%, ఆంధ్రప్రదేశ్‌లో 18 శాతం మంది ఇప్పటివరకూ కనీసం ఒక్క డోసు టీకా అయినా పొందారు. ఈ లెక్కలను కేంద్రం తాజాగా విడుదల చేసింది.