రూ.15 వేల విలువైన మేకపోయింది.. నష్టపరిహారం ఇవ్వండి.. తలపట్టుకున్న పోలీసులు
అల్లారు ముద్దుగా పెంచుకున్న మేక అపహరణకు గురైందని, అందువల్ల ప్రభుత్వం పరిహారమివ్వాలని ఓ వ్యక్తి వాదిస్తున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా ప్రాంతానికి చెందిన సబేదార్ దేవ్ సింగ్ అనే వ్యక్తి ఆర్మీలో పనిచే
అల్లారు ముద్దుగా పెంచుకున్న మేక అపహరణకు గురైందని, అందువల్ల ప్రభుత్వం పరిహారమివ్వాలని ఓ వ్యక్తి వాదిస్తున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా ప్రాంతానికి చెందిన సబేదార్ దేవ్ సింగ్ అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి పదవీ విరమణ పొందాడు. అతను పెంచుకుంటున్న మేక ఏప్రిల్ 17న అపహరణకు గురైంది. దానికోసం ఎంత వెతికినా అది మాత్రం దొరకలేదు. అయితే ఓ రోజు ఇద్దరు వ్యక్తులు మేకను కిడ్నాప్ చేసి అమ్మేసినట్లు తెలిసి బిత్తరపోయాడు. దీంతో సుబేదార్ పోలీసులను ఆశ్రయించి తనకు నష్టపరిహారం కావాలని కోరాడు.
తన మేకను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించి, అమ్మేశారని దాని విలువ సుమారు రూ.15,000 ఉంటుందని ఈ పరిహారం ప్రభుత్వమే తనకి చెల్లించాలని ఓ లేఖ రాసి పోలీసులకు ఇచ్చాడు. అది చూసి నవ్వాలో.. ఏడ్వాలో అర్థంకాని పోలీసులు తలబద్దలు కొట్టుకుంటున్నారు.