మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 12 జూన్ 2021 (15:44 IST)

నోయిడా నగరంలో బంగారం దోపిడీ ముఠా గుట్టు రట్టు

నోయిడా నగరంలో బంగారం దోపిడీ ముఠా గుట్టు రట్టు అయింది. గత ఏడాది సెప్టెంబరులో గ్రేటర్ నోయిడాలోని ఒక ఇంట్లో దోపిడీకి పాల్పడిన ముఠాను అరెస్టు చేశామని నోయిడా డీసీపీ రాజేష్ చెప్పారు. 
 
రూ. 6.5. కోట్ల విలువ గల 13 కిలోల బంగారం రూ.57 లక్షల నగదు, మహీంద్రా స్కార్పియో కారు, కోట్ల రూపాయల విలువైన భూమి ఆస్తి పత్రాలను దొంగల నుంచి స్వాధీనం చేసుకున్నామని డీసీపీ చెప్పారు. 
 
పోలీసులు పట్టుకున్న దొంగ్లో రాజన్ భాటి, అరుణ్ సింగ్, జేసింగ్, నీరజ్ సింగ్, అనిల్ సింగ్, బింటు శర్మలుగా గుర్తించారు. దోపిడీ దొంగలు నోయిడా ఇంటి నుంచి 40 బంగారం బిస్కెట్లను దోచుకెళ్లగా, పోలీసులు చోరీ సొత్తును రికవరీ చేసి, దొంగలను అరెస్టు చేశారు.