బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 26 డిశెంబరు 2016 (11:04 IST)

రోడ్డుపై అక్రమంగా వాహనాన్ని పార్కింగ్ చేస్తే రూ.1000 ఫైన్.. నితిన్ గడ్కరీ

కేంద్ర ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం తీసుకోనుంది. రోడ్డుపై అక్రమంగా వాహనాన్ని పార్కింగ్ చేస్తే రూ. వెయ్యి అపరాధం విధించాలని భావిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించ

కేంద్ర ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం తీసుకోనుంది. రోడ్డుపై అక్రమంగా వాహనాన్ని పార్కింగ్ చేస్తే రూ. వెయ్యి అపరాధం విధించాలని భావిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. 
 
ప్రస్తుతం అక్రమంగా వాహనాన్ని పార్కింగ్ చేసిన వారి నుంచి రూ.200 మాత్రమే ఫైన్ వసూలు చేస్తున్నారు. దీన్ని వెయ్యి రూపాయలకు పెంచాలని భావిస్తున్నారు. స్మార్ట్ నాగ్‌పూర్ సిటీ సదస్సులో కేంద్రమంత్రి గడ్కరీ మాట్లాడుతూ అక్రమంగా వాహనాలను రోడ్లపై పార్కింగ్ చేయకుండా నివారించేందుకు జరిమానాల పెంపు విధానాన్ని తీసుకురానున్నామన్నారు. 
 
రోడ్లపై అక్రమంగా పార్కింగ్ చేస్తే ఎవరైనా దాన్ని క్లిక్ మనిపించి ట్రాఫిక్ పోలీసు, రవాణాశాఖకు పంపించవచ్చునన్నారు. రోడ్లు ఆక్రమణకు గురికాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. సరైన పార్కింగ్ సౌకర్యం లేకుండా భవనాల నిర్మాణానికి అనుమతి ఇవ్వవద్దని గడ్కరీ కోరారు.