శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 14 డిశెంబరు 2017 (15:34 IST)

గుజరాత్ ఫలితాలతో దిమ్మతిరిగిపోతుంది : హార్దిక్ పటేల్

గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దిమ్మతిరిగిపోయేలా ఉంటాయని పటీదార్ అనామత్ ఆందోళన్ నాయకుడు హార్దిక్ పటేల్ జోస్యం చెప్పారు.

గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దిమ్మతిరిగిపోయేలా ఉంటాయని పటీదార్ అనామత్ ఆందోళన్ నాయకుడు హార్దిక్ పటేల్ జోస్యం చెప్పారు. గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం రెండో దశ ఎన్నికల పోలింగ్ జరిగింది.
 
ఈ ఎన్నికల్లో ఆయన తన ఓటు హక్కును అహ్మదాబాద్‌లో వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గుజరాత్ ఎన్నికల ఫలితాలు దిమ్మదిరిగేలా ఉంటాయన్నారు. గుజరాత్ ఓటర్లు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పనున్నారని, తమ అంచనాలకు తగినట్టుగానే ఫలితాలు ఉంటాయన్నారు. కాగా, ఈ ఎన్నికల్లో హార్దిక్ పటేల్ సారధ్యంలోని పటీదార్ ఆందోళన్ సమితి కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
ఇదిలావుండగా, వడోదరాలో వడోదరా మహరాజ్ సమర్జీత్ సింగ్ గైక్వాడ్, ఆయన తల్లి రాజమాత శుభాంగినీ దేవి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా ఓటు వేశారు. చోటా ఉదయ్‌పూర్‌లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఓటింగ్ ప్రక్రియ గంటసేపు ఆలస్యంగా ప్రారంభమైంది. ముస్లిం ప్రభావిత ప్రాంతమైన జుహూపురాలో చాలా తక్కువ పోలింగ్ నమోదైంది.