శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 9 డిశెంబరు 2017 (16:50 IST)

బీజేపీ కంచుకోట గుజరాత్‌లో తొలి దశ ఎన్నికలు: ఓటేసిన పెళ్లి జంటలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో తొలి దశ ఎన్నికలు ప్రారంభమైనాయి. ఈ రాష్ట్రంలోని 89 అసెంబ్లీ స్థానాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రెండుదశల్లో జరిగే ఈ ఎన్నికల్లో తొల

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో తొలి దశ ఎన్నికలు ప్రారంభమైనాయి. ఈ రాష్ట్రంలోని 89 అసెంబ్లీ స్థానాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రెండుదశల్లో జరిగే ఈ ఎన్నికల్లో తొలిదశలో భాగంగా సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లో శనివారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భాగంగా ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ మెషిన్‌ను ఈసీ ఉపయోగిస్తుంది. దీన్ని ఉపయోగించి తాము ఓటేసిన అభ్యర్థికే ఓటు పడిందా లేదా అనే విషయాన్ని ఓటరు నిర్థారించుకునే వీలుంటుంది.
 
ఇకపోతే.. గుజరాత్ తొలి దశ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పెళ్లి జంటలు విచ్చేశాయి. సూర‌త్‌లో క‌తార్గాం పోలింగ్ కేంద్రంలో ముఖానికి ప‌సుపుతో ఫెన్నీ ఫ‌రేఖ్ అనే మ‌హిళ ఓటు వేయ‌డానికి వ‌చ్చింది. అలాగే భ‌రూచ్ పోలింగ్ కేంద్రంలో శనివారం వివాహం చేసుకున్న ఓ జంట పెళ్లి దుస్తులతో వచ్చి ఓటేశారు. ఇదేవిధంగా రాజ్‌కోట్‌లోని ధార‌ళా గ్రామంలో మ‌మ‌తా గొండాలియా అనే యువ‌తి పెళ్లి కూతురిగా వ‌చ్చి ఓటు వేసింది. ప్రస్తుతం గుజరాత్ ఎన్నికల్లో ఓటేసిన పెళ్లి జంటల ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
 
2002 నుంచి గుజరాత్‌కు బీజేపీ కంచుకోటగా మారింది. ప్రధానిగా మోదీ ఎన్నికయ్యాక ఆయన సొంత రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తోన్న ఎన్నికలు కావడంతో.. దేశవ్యాప్తంగా గుజరాత్ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. మోదీ నాయకత్వంలోని కమలం పార్టీ వరుసగా ఐదుసార్లు గెలుపును నమోదు చేసుకోగా, 22 సంవత్సరాల పాటు అధికారంలో వుండి రాష్ట్రాన్ని పాలించింది.