బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 27 ఏప్రియల్ 2017 (11:05 IST)

ఉద్యోగ ఇంటర్వ్యూకు పిలిచారు.. రాత్రంతా గదిలో ఉంచి ఆరుగురు ఒకేసారి రేప్ చేశారు... ఢిల్లీలో గ్యాంగ్ రేప్

దేశరాజధాని ఢిల్లీలో మరో సామూహిక అత్యాచారం ఘటన జరిగింది. ఉద్యోగం పేరుతో ఓ మహిళను నమ్మించిన ఆరుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అదీ కూడా ఓ గదిలో రాత్రంతా బంధించి.. ఆరుగురు కలిసి ఒకేసారి

దేశరాజధాని ఢిల్లీలో మరో సామూహిక అత్యాచారం ఘటన జరిగింది. ఉద్యోగం పేరుతో ఓ మహిళను నమ్మించిన ఆరుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అదీ కూడా ఓ గదిలో రాత్రంతా బంధించి.. ఆరుగురు కలిసి ఒకేసారి రేప్ చేస్తూ చిత్రహింసలకు గురి చేశారని బాధితురాలు వాపోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఢిల్లీ, గుర్గావ్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఓ యువతి పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తోంది. ప్రస్తుతం చేస్తున్న దానికంటే మంచి ఉద్యోగం ఉందని, ఆ ఇంటర్వ్యూకు రావాలంటూ ఆమెకు తెలిసిన కల్లూ రామ్ అనే వ్యక్తి నమ్మబలికాడు. ఈ మాటలు నమ్మి అతని వద్దకు వెళ్లిన ఆ యువతిని బిలాస్‌పూర్‌ అనే గ్రామానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలికి మెడికల్‌ పరీక్షలు నిర్వహించి నేరస్తులను అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 
 
దీనిపై బాధితురాలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో 'మంగళవారం సాయంత్రం 5.30గంటల ప్రాంతంలో కల్లు మంచి ఉద్యోగం ఉంది రమ్మని కల్లూ రామ్ ఫోన్‌ చేసి పిలిపించాడు. వెంటనే ఐఎంటీ చౌక్‌కు రమ్మని బలవంతం చేశాడు. అతడిని నమ్మి గుర్గావ్‌ నుంచి మానేసార్‌కు రాత్రి 7 గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకున్నాను. కొద్దిసేపు తర్వాత సూపర్‌వైజర్‌ వచ్చి తీసుకెళతాడని కల్లు నాతో చెప్పాడు. పిమ్మట 15 నిమిషాల తర్వాత సూపర్‌‌వైజర్‌ అని చెప్పుకుంటూ ఓ వ్యక్తి బైక్‌పై వచ్చాడు. అతడు తన బైక్‌పై ఎక్కించుకొని కంపెనీకి తీసుకెళ్లకుండా బిలాస్‌పూర్‌కు సమీపంలోని శంకర్‌ కిదాని అనే గ్రామానికి తీసుకెళ్లాడు. 
 
అప్పటికే ఆ అక్కడ ఓ గదిలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. తాను గదిలోకి వెళ్లాక మరో ముగ్గురు వచ్చారు. వీరంతా కలిసి గదిలో బంధించి రాత్రంతా లైంగికదాడి చేశారు. ఆరుగురు వ్యక్తులు ఒకేసారి అత్యాచారం చేశారని ఆ మహిళ బోరున విలపిస్తూ చెప్పింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపిపడేస్తామని బెదరించారు. కానీ, ఏదో ఒకలా ఉదయం 6 గంటల ప్రాంతంలో తప్పించుకొని ఇంటికి వెళ్లి నా భర్తకు చెప్పాను’ అని బాధితురాలు చెప్పడంతో ఈ గ్యాంగ్ రేప్ ఘటన వెలుగులోకి వచ్చింది.