గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 20 ఏప్రియల్ 2019 (15:45 IST)

బీజేపీ ఎమ్మెల్యేకు జీవితఖైదు

భారతీయ జనతా పార్టీకి చెందిన హరీంపూర్ శాసనసభ సభ్యుడు అశోక్ సింగ్‌ చందెల్‌కు జీవితకారాగార శిక్షను కోర్టు విధించింది. కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో అలహాబాద్ హైకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. ఈ హత్యలు 22 యేళ్ల క్రితం జరుగగా, తుది తీర్పు ఇప్పటికీ వెలువడింది.
 
ఈయన 22 యేళ్ళ క్రితం తన కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులను హత్య చేశాడు. దీనిపై హమీర్‌పూర్ జిల్లా పోలీసులు కేసు నమోదు చేయగా, కేసు విచారణ సాగుతూ వచ్చింది. ఈ క్రమంలో హరీంపూర్ జిల్లా కోర్టు 2002 జూలై 15వ తేదీన ఇచ్చిన హైకోర్టులో సవాల్ చేశారు.
 
ఈ కోర్టు కూడా ఆయనతో పాటు.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 9 మందిని దోషులుగా తేల్చి యావజ్జీవ కారాగార శిక్షలను విధించింది. ఈ తీర్పు అనంతరం ఎమ్మెల్యే అశోక్ సింగ్ మాట్లాడుతూ, హైకోర్టు తీర్పును తాను గౌరవిస్తున్నానని చెప్పారు. న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు.