మంగళవారం, 15 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 7 మే 2016 (13:21 IST)

అబ్దుల్ కలాం పేరును వాడటానికి వీల్లేదు : మద్రాసు హైకోర్టు

భారత అణుశాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలాం పేరు లేదా ఫోటోను రాజకీయ పార్టీ ఏర్పాటుకు ఉపయోగించరాదని మద్రాస్ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.
 
కలాం సహాయకుడు పొనరాజ్‌ 'అబ్దుల్‌ కలాం లక్ష్య ఇండియా' పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో కలాం సోదరుడు మహమ్మద్‌ ముత్తుమీరాన్ హైకోర్టులో ఓ పిటీషన్ దాఖలు చేశారు. 
 
తన సోదరుడు భారతదేశం గర్వించదగిన మహనీయుడని, ఆయన పేరును రాజకీయ పార్టీలకు ఉపయోగించడం ఆయన కీర్తిని దిగజార్చడమే అవుతుందని ఆ పిటీషన్‌లో పేర్కొన్నారు.
 
ఈ పిటీషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు రాజకీయ ప్రయోజనాల కోసం అబ్దుల్‌ కలాం చిత్రపటాలను గానీ, పేరును గాని ఉపయోగించరాదని ఆదేశాలు జారీచేసింది.